బీహార్ లో పుట్టిన ఆ బాలుడు సొంతింట్లో టాయిలెట్ సదుపాయం లేకుండానే పెరిగాడు. తన కుటుంబంలో మహిళలు బహిర్భూమికి వెళ్లాలంటే ఊరవతలికి వ...
డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆడుతూ పాడుతూ బొమ్మలతో, కథలతో గడిపే ఆరేళ్ల ప్రాయంలోనే స్వచ్ఛతపై ఆయనకు మమకారం మొదలైంది. నాటి సంకుచిత సమాజం అస్పృశ్యురాలిగా పిలిచే ఓ మహిళను ఒకరోజు ఆయన అనుకోకుండా తాకాడు. నానమ్మ ఆయనను తిట్టింది, కుటుంబ సభ్యులు కోపగించుకున్నారు. కానీ, ఆ బాలుడి మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఇంట్లో టాయిలెట్ లేకపోవడం వల్ల కుటుంబంలోని స్త్రీలు కూడా కాలకృత్యాల కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయని గమనించాడు. ఈ సంఘటనలు అతడిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అతడు పెద్దయ్యాాక, స్వచ్ఛతను ప్రోత్సహించడమే తన జీవిత లక్ష్యయమైంది. టాయిలెట్ల విషయమై పనిచేయడం మొదలుపెట్టిన సమయంలో ఆయన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడ్డారు, జనం ఎన్నో మాటలన్నాారు. చాలా మంది ఆయనను ఎగతాళి కూడా చేశారు. కానీ, సామాజిక సేవపట్ల ఆయనకున్న నిబద్ధత చాలా గొప్పది. దానికే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. సేవా మార్గాన్ని వీడని డాక్టర్ పాఠక్.. అందులో ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. మహాత్మాా గాంధీ స్వచ్ఛతా భావాలను సంస్థాగతం చేశారు.
ప్రజాస్వామ్యానికి నిలయమైన వైశాలిలో 1943 ఏప్రిల్ 2న జన్మించిన డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ 1964 లో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి సోషియాలజీ పట్టా అందుకున్న పాఠక్.. 1980లో మాస్టర్స్, 1985లో పీహెచ్డీ పూర్తి చేశారు. రచయితగానూ పేరు సంపాదించుకున్న ఆయన.. 'ది రోడ్ టు ఫ్రీడం' సహా పలు పుస్తకాలు రాశారు. స్వచ్ఛతా భావానికి అత్యంత వినూత్నంగా సంస్థాగత రూపానిచ్చాారు. ఇంటి చుట్టూనే దొరికే వస్తువులను ఉపయోగించి తక్కువ వ్యయంతోనే పూర్తి చేయగల డిస్పోజల్ కంపోస్ట్ టాయిలెట్‌ను 1968లో ఆయన నిర్మించారు. సులభ్ అంతర్జాతీయ సేవా సంస్థథకు 1970లో పునాది పడింది. 1973లో బీహార్‌లోని అరా మునిసిపాలిటీకి చెందిన ఓ అధికారి డాక్టర్ పాఠక్‌కు రూ. 500 ఇచ్చి మన్సిపాలిటీ ఆవరణలో రెండు టాయిలెట్లు నిర్మించమని కోరారు. ఆయన చేపట్టిన కార్యక్రమంలో ఇది ప్రధానమైన మలుపు. అక్కడ డ్రై టాయిలెట్ ను సులభ్ టాయిలెట్ గా మార్చిన డాక్టర్ పాఠక్.. విశేషమైన ప్రశంసలు పొందారు.
ఇక అప్పటినుంచి ఆయన చేపట్టిన కార్యక్రమం విశేషంగా పురోగమించింది. ఒకదానివెంట ఒకటిగా బీహార్ లో అనేక టాయిలెట్లను ఆయన నిర్మించారు. దేశంలో 10,123కు పైగా పబ్లిక్ టాయిలెట్లను సులభ్ సంస్థ నిర్మించింది. అంతేకాకుండా గృహాల్లో దాదాపు 16 లక్షలు, పాఠశాలల్లో 32 వేలకు పైగానూ.. దాదాపు 2,500 సేవాబస్తీల్లో నూ టాయిలెట్లను ఆ సంస్థ నిర్మించింది. వీటితో పాటు 200 కు పైగా బయోగ్యాాస్ ప్లాంట్లను, 12 కి పైగా ఆదర్శ గ్రామాలను కూడా నిర్మించింది. ఇది మాత్రమే కాదు.. పది వేల మందికి పైగా సఫాయీ కర్మచారి వ్యవస్థ (మాన్యువల్ స్కాావెంజింగ్) నుంచి విముక్తులను చేసిన ఘనత కూడా డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ కే దక్కుతుంది. బృందావన్, కాశీ, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన అనేక కార్యక్రమాలను కూడా ఆయన చేపట్టారు. ముఖ్యంగా ఎవరూ లేని నిస్సహాయ మహిళలకు అండగా నిలిచేలా భారీ కార్యయక్రమాలను ఆయన నిర్వవహించారు. పారిశుద్ధ్యం అంశంపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నారు. ఆయన స్థాపించిన సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు ప్రస్తుతం 50 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా ఈ సంస్థకు గుర్తింపు ఉంది.
డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ 2023 ఆగష్టు 15న కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనను స్మరించుకుంటూ.. “సామాజిక పురోగతి, బడుగు వర్గాల సాధికారత కోసం విస్తృతంగా కృషి చేసిన దార్శశనికుడు ఆయన. ఆయనతో మాట్లాడిన అనేక సందర్భాాల్లో, ప్రతిసారీ స్వచ్ఛత పట్ల ఆయనకున్న అభిలాష స్పష్టంగా వ్యక్తమయ్యేది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నాారు.
భారత మూడో అతిపెద్ద పౌర పురస్కారమైన 'పద్మ భూషణ్'తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1990లో సత్కరించింది. సామాజిక సేవా రంగంలో విశేష కృషికి గాను డాక్టర్ పాఠక్ కు ‘పద్మ విభూషణ్’ ( మరణానంతరం ) లభించింది.
No comments