కార్మికుల కోసం పోరాడిన నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ జార్జ్ ఫెర్నాండెజ్ చాలా సాధారణ జీవితం గడిపిన ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి. 16 ఏ...
కార్మికుల కోసం పోరాడిన నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్
జార్జ్ ఫెర్నాండెజ్ చాలా సాధారణ జీవితం గడిపిన ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి. 16 ఏళ్ల వయస్సులోనే జార్జ్ చర్చిలో దేవుడికి సేవ చేసే మార్గాన్ని ఎంచుకున్నారు. కాని ఎందుకో తక్కువ సమయంలో ఆ మార్గం మంచి వెనుదిరిగారు. తర్వాత బతుకు బండి ముందుకు నడిపించేందుకు ఎన్నో పనులు చేయడం ప్రారంభించారు. ఆయన ఒక దగ్గర రోజువారీ కూలీగా పని చేస్తున్నప్పుడే గొప్ప కార్మిక సంఘ నేతగా ఎదిగారు. తర్వాత ఆయన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ద్వారా అగ్రనాయకుడిగా పేరుగాంచారు. తొమ్మిది సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు, మూడుసార్లు కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తన బంగ్లాకు ఉన్న ఒక గేటును తొలిగించేశారు. సామాన్య ప్రజలు తనను కలవడానికి ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఆయన ఈ పని చేశారు.
కర్ణాటకలోని మంగుళూరు నగరంలో జూన్ 3, 1930న ఒక క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. జార్జ్ ఫెర్నాండెజ్. తన తల్లిదండ్రులకు మొదటి సంతానం ఈయన. పుట్టినప్పుడు కుటుంబం మొత్తం ఈయన్ని ప్రేమగా జారీ అని పిలుచుకునేది. తర్వాత ఆయన తల్లి బ్రిటిష్ మోనార్క్ కింగ్ జార్జ్ V పేరు వచ్చేలా జార్జ్ అని పేరు పెట్టారు.
తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత జార్జ్ పూర్వీకుల సంప్రదాయం ప్రకారం 16 సంవత్సరాల వయసులో మత పెద్దగా మార్చేందుకు ఆయన్నిబెంగళూరుకు పంపారు, కానీ ఆయన చర్చి నుంచి పారిపోయి ముంబై చేరుకుని, బతకడం కోసం అనేక ఉద్యోగాలు చేశారు.
ట్రేడ్ యూనియన్ ఉద్యమం నుంచి ప్రేరణ పొందిన ఫెర్నాండెజ్, అప్పటి నుంచి ట్రేడ్ యూనియన్ సమావేశాలలో పాల్గొనడం ప్రారంభించారు. 1950 నాటికి ఆయన టాక్సీ ట్రేడ్ యూనియన్లో బాగా ప్రాచుర్యం పొందారు.
తన జీవితం తొలి రోజుల నుంచే, ఫెర్నాండెజ్ సాధారమైన జీవనశైలిని, అలాగే ఏదైనా ఒక కారణం కోసం తిరుగుబాటు చేసే తత్వాన్ని అలవర్చుకున్నారు. సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ తో ఆయన సమావేశమయ్యాక ఎన్నికల రంగంలోకి ఆరంగేట్రం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ముంబై దక్షిణ నుండి యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ద్వారా టికెట్ పొంది, కాంగ్రెస్ నేత ఎసి పాటిల్ పై పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచారు. చాలా శక్తివంతమైన ప్రత్యర్థిని ఓడించిన ఘనతను ఆయన సంపాదించుకున్నారు. ఆ ఓటమీతో ఎసి పాటిల్ రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగారు. 1973లో ఫెర్నాండెజ్ ఆల్ ఇండియా రైల్వే పురుషుల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో 14 లక్షల మంది రైల్వే ఉద్యోగులు రైల్వేలో చాలా తక్కువ జీతం పొందేవారు. రైల్వే సిబ్బంది జీతాలను పెంచాలాని డిమాండ్ చేస్తూ 1974లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో మొదటిసారి దేశంలో రైల్వే సేవలు ఎక్కడికక్కడ స్తంభించాయి. 30,000 మందికి పైగా కార్మికులు జైలు పాలయ్యారు.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎప్పుడైతే దేశంలో ఎమర్జెన్సీని (అత్యవసర పరిస్థితిని) విధించారో, అప్పుడు ఫెర్నాండెజ్ ఒక సిక్కు కార్మికుడిగా మారువేషంలో 22 నెలల పాటు గడిపారు. దేశంలో అత్యవసర పరిస్థితికి కారణం రైల్వే సమ్మె అని ఇందిరా గాంధీ తరచూ అనేవారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేందుకు ఏర్పడిన లోక్ సంఘర్ష్ సమితికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో ఫెర్నాండెజ్ పరారీలో ఉన్నప్పుడు ఆయన భద్రతను కూడా తన బాధ్యతగా తీసుకున్నారు. అత్యవసర పరిస్థితి తర్వాత మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఫెర్నాండెజ్ పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఇదే సమయంలో విదేశీ మారక నియంత్రణ చట్టాన్ని (ఫెరా) అనుసరించడానికి నిరాకరించిన కోక్, ఐబీఎం లాంటి బహుళ జాతి కంపెనీలను దేశం విడిచిపోవాలని ఆదేశించారు.
1989 నుండి 1990 వరకు రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్లను వెనుకుండి నడిపించిన వ్యక్తి ఫెర్నాండెజ్. 1995లో ఈ సోషలిస్టు నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయికు బాగా దగ్గరయ్యారు. రక్షణ మంత్రిగా ఆయన సియాచిన్ను 18 సార్లకు పైగా సందర్శించారు. వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం ఫోఖ్రాన్ వద్ద విజయవంతంగా రెండోసారి అణు పరీక్షలు నిర్వహించింది. అలాగే ఆయన రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడే 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. 2003 లో భారతీయ వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానాల ప్రమాదాల సంఖ్య పెరిగింది. దీంతో ప్రతిపక్షం ప్రభుత్వంపై మాటల యుద్ధానికి దిగింది. మిగ్-21ను అప్పట్లో ఎగిరే శవపేటికలుగా పిలిచేవారు. ఆ సయమంలో ఫెర్నాండెజ్ స్వయంగా అంబాలా ఎయిర్ బేస్ వద్ద దాదాపు 25 నిమిషాల పాటు మిగ్-21లో ప్రయాణించారు. 2004, ఆయన అల్జీమర్ వ్యాధి బారినపడ్డారు. 2009లో ఫెర్నాండెజ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, అనారోగ్యం అతన్ని మరింత కుంగదీసింది. ప్రజా జీవితానికి ఆయన దూరం అయ్యేలా చేసింది. జనవరి 29, 2019న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

No comments