Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆధునిక అస్సాం పితామహుడు గోపినాథ్ బార్డోలాయి - About Gopinath Bordoloi in Telugu

ఆధునిక అస్సాం పితామహుడు గోపినాథ్ బార్డోలాయి గోపినాథ్ బార్డోలాయి ది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన న్యాయవాదిగా, ఉపాధ్యాయుడిగా, సామాజ...

ఆధునిక అస్సాం పితామహుడు గోపినాథ్ బార్డోలాయి

గోపినాథ్ బార్డోలాయిది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన న్యాయవాదిగా, ఉపాధ్యాయుడిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, రాజకీయ వేత్తగా బార్డోలాయి పలు బాధ్యతలు నిర్వర్తించారు. చైనా, తూర్పు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అస్సాం సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి ఈయన కృషి చేశారు. ఈ కృషి ఫలితంగానే నేడు అస్సాం భారత్ భూభాగంలో భాగమైంది. రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఎంతో శ్రమించిన ఆయన, ఆధునిక అస్సాంకు పితామహుడిగా నిలిచారు.

స్వాతంత్య్రాన్ని సాధించడానికి పోరాడిన ఎంతో మంది మహోన్నతమైన వ్యక్తులకు సుదీర్ఘకాలం తరువాత ప్రభుత్వ గుర్తింపు లభించింది. గోపినాథ్ బార్డోలాయి అస్సాం నాగాన్లోని రాహ లో జూన్ 6, 1890లో జన్మించారు. ఆధునిక అస్సాం రూపశిల్పి' గా ఆయన పేరు గాంచారు. బార్డోలాయి తన 12 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. గౌహతిలో తన ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన, కోల్కతాలో మాస్టర్స్, బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత తిరిగి అస్సాంకు వచ్చారు. తొలుత స్థానికంగా ఉండే ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. ఆ తర్వాత న్యాయ విద్యను సాధన చేశారు. 1917లో దేశం స్వాతంత్య్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు యువత కూడా దేశ స్వాతంత్య్ర పోరాటంలో చేరడం ప్రారంభించింది. బ్రిటిష్ పాలనలో అస్సాం, ఈశాన్య ప్రాంతం తీవ్ర నరకయాతన ఎదుర్కొంటుండటంతో బార్డోలాయి కూడా తన న్యాయ విద్యాభాసం పక్కన పెట్టేసి, సహాయ నిరాకరణోద్యమంలో చేరారు.

ఈ సమయంలో అస్సాం రాష్ట్రమంతటా తిరిగిన బార్డోలాయికి మంచి గుర్తింపు వచ్చింది. 1922లో భారత జాతీయ కాంగ్రెసు ఆధారంగా చేసుకొని, దాని ఆధ్వర్యంలో అస్సాం కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు. బార్డోలాయి. 'చౌరీ-చౌరా' సంఘటన తర్వాత సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయడంతో, బార్డోలాయి మళ్లీ న్యాయ విద్యను అభ్యసించడం ప్రారంభించారు. ఆ తర్వాత 1932లో గౌహతి మున్సిపల్ బోర్డుకు చైర్మన్ అయ్యారు. 1935లో అస్సాంలో ఎన్నికలు జరిగినప్పుడు, బార్డోలాయి నేతృత్వం వహించే కాంగ్రెస్ అధిక సంఖ్యాబలాన్ని (మెజార్టీని) సాధించింది. అయితే బార్డోలాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ప్రతిపక్షంలో ఉండేందుకే మొగ్గు చూపారు. అయితే, 1938లో ప్రభుత్వం పడిపోయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, మహాత్మగాంధీ పిలుపు మేరకు ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ, అనారోగ్య కారణాలతో స్వల్ప కాలంలోనే బార్టోలాయి జైలు నుంచి విడుదలయ్యారు.

ఆగస్టు 1942లో 'క్విట్ ఇండియా' ఉద్యమం తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం కాంగ్రెస్ ను అక్రమమైనదిగా ప్రకటించి, బార్డోలాయితో సహా కాంగ్రెస్ నేతలందరిన్నీ అరెస్టు చేసింది. అయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన 1946 ఎన్నికల్లో గెలపడంతో అస్సాం ముఖ్యమంత్రిగా బార్టోలాయి మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే బ్రిటీష్ ప్రభుత్వం 'కేబినెట్' 'మిషన్' తో భారత్ కు వచ్చింది. మూడు భిన్న వర్గాలుగా రాష్ట్రాలను విడగొట్టాలని పథకం వేసింది. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాలని చూసింది. బెంగాల్ను, అస్సాంను ఒకే వర్గంగా విభజించింది. అంటే, బెంగాల్తో పోలిస్తే అస్సాం ప్రతినిధులు తక్కువగా ఉండేలా పథకాలు రచించింది. కానీ, ఈ పథకాన్ని బార్డోలాయి తిరస్కరించారు. ఆ విధంగా చేస్తే అస్సాం తన ఉనికిని కోల్పోతుందని వాదించారు. అలా తూర్పు పాకిస్తాన్ బారిన పడకుండా అస్సాంను ఆయన కాపాడారు. భారత స్వాతంత్ర్యము తర్వాత, ఈయన కమ్యూనిష్ఠు చైనా, తూర్పు పాకిస్తాన్ ల నుండి అస్సాంను రక్షించడానికి సర్దార్ వల్లభభాయి పటేల్తో సన్నిహితంగా పనిచేశాడు. విస్తృతమైన హింసాకాండ మూలముగా తూర్పు పాకిస్తాన్ నుండి పారిపోయి వచ్చిన లక్షల కొలది కాందిశీకులను తిరిగి పంపే పని నిర్వహించాడు. ఈయన కృషి 1971 లో తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటము జరిగే వరకు అస్సాం రాష్ట్రములో స్థిరత్వము యేర్పడి మత సామరస్యముతో ప్రజస్వామ్యము నిలదొక్కుకోవడానికి దోహదము చేసింది.

అస్సాం మెడికల్ కాలేజీని, అస్సాం హైకోర్టును, గౌహతి యూనివర్సిటీని, అస్సాం వెటర్నరీ కాలేజీని స్థాపించడంలో బార్టోలాయి పాత్ర కీలకం. బార్డోలాయి అస్సాం ప్రజల మన్ననలు పొందారు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి అస్సాం గవర్నర్ జయరాం దాస్ దౌలత్రామ్ అతనికి 'లోక్ ప్రియ' అనే బిరుదును ప్రధానం చేశారు. 1950 ఆగస్ట్ 5 న మరణించారు.

అటల్ బిహారి వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు బార్టోలాయికి ఆయన మరణానంతరం 1999లో భారత రత్న ప్రదానం చేశారు. 2002లో పార్లమెంట్లో బార్డోలాయి విగ్రహాన్ని రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం ఆవిష్కరించారు. గౌహతి విమానాశ్రయానికి లోకప్రియ గోపీనాధ్ బొర్దొలాయి అంతర్జాతీయ విమానాశ్రయముగా నామకరణము చేశారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

No comments