Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ వీరుడు, గోరక్షకుడు మహారాజా సుహేల్ దేవ్! - About Suheldev Pasi in Telugu

హిందూ వీరుడు, గోరక్షకుడు మహారాజా సుహేల్ దేవ్! దురాక్రమణదారుడు ముస్లిం మతోన్మాది గజనీ మహమ్మద్ సైన్యాన్ని ఓడించి అతడిని ప్రస్తుత ఉ...


హిందూ వీరుడు, గోరక్షకుడు మహారాజా సుహేల్ దేవ్!

దురాక్రమణదారుడు ముస్లిం మతోన్మాది గజనీ మహమ్మద్ సైన్యాన్ని ఓడించి అతడిని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి రాకుండా 20 సంవత్సరాలు ఆపిన సుహేల్ దేవ్ పాసి అనే వీరుడెవ్వరో తెలుసా, ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో దళితులు అని పిలవబడే పాసి కులానికి చెందిన శ్రావస్ధీ సామ్రాజ్య చక్రవర్తి మహారాజు సుహేల్ దేవ్ పాసి.

ఆనాటి కాశీ - అయోధ్య ప్రాంతాలలోని హిందువులచే బ్రాహ్మణులచే ఇంద్రుడి అవతారంగా కొలవబడిన ధర్మాత్ముడితడు. మనం చదువుకున్న మన దేశ చరిత్రలో సుహేల్ దేవ్ ప్రస్తావన లేకుండా కేవలం ముస్లిం మతోన్మాది మహమ్మద్ గజని లాంటి వారే ఎందుకున్నారు? మనం చదివింది అసలు మన నిజమైన భారత చరిత్ర కాదు కదా!!

గజనీ మహమ్మద్ కి చెందిన 6 గురు సేనాధ్యక్షులని కౄరమృగాల వంటి వారి సైన్యం తో సహా మట్టుబెట్టి గజని మహమ్మద్ ని కాశీ అయోధ్య ప్రాంతాల్లోకి రాకుండా తరిమి తరిమి కొట్టిన మహారాజు వీరుడు శూరుడు అయిన సుహేల్ దేవ్ పాసి.

అలాంటి సుహేల్ దేవ్ పాసి మహారాజా ని గెలవడానికి గజని సైన్యం వాడిన ఆయుధం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది హిందువులు పవిత్రంగా పూజించే గోవులు. అవును సుహేల్ దేవ్ పాసికి గల గోభక్తి ని అడ్డుపెట్టుకుని గజని మహమ్మద్ సైన్యానికి ఎదురుగా గోవులను అడ్డుగా పెట్టుకుని, తాము బాణాలు వేస్తే ఎక్కడ గోవులు చనిపోతాయేమో అని ఆగిన సుహేల్ దేవ్ పాసి ని దొంగతనంగా వెనుక వైపు నుంచి వచ్చి దాడి చేసి జయించారు.

ఈ దుర్ఘటన వెనుక సుహేల్ దేవ్ పాసి మహరాజుకు, హిందువులకు గోమాతల పైన వున్న భక్తిశ్రధ్ధల గురించి గజనీ మహమ్మద్ కి చెప్పినవారు, ధర్మ ద్రోహులయిన ఆనాటి కొంతమంది దుష్ట దుర్మార్గులు అయిన హిందువులే. అలాంటి హిందూ ద్రోహులు నేటికీ వున్నారు.

ఇంతటి గొప్ప వీరుడి చరిత్ర మనకు ఈ రోజున ఇరాన్ దేశంలో వున్న గ్రంధాలయాలలోని చరిత్ర పుస్తకాలలో కనబడుతుంది. ఆ కాలంలో ఇరాన్ వారు ఒక గొప్ప వీరుడిగా గౌరవించిన హిందూ రాజు సుహేల్ దేవ్ పాసి. వీరుడిని మన భారత దేశంలో మాత్రం ఎప్పుడో మరచిపోయాము. కారణం మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హిందూ వీరులు రక్షకులు దేశభక్తుల చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తోలగించారు.

ఇలాంటి వీరుడిని గౌరవించడానికి భారత్ దేశానికి 2018 సంవత్సరంలో అవకాశం లభించింది. 2018 లో శ్రీమాన్ నరేంద్ర మోది గారు భారత దేశ ప్రధాన మంత్రి అయ్యాక మహారాజ సుహేల్ దేవ్ పాసి పేరుమీద స్టాంపు విడుదల చేసారు.

2017 లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ గారు, RSS నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా సూర్య మందిరాన్ని ప్రభుత్వ పరంగా పునర్నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుని, మహారాజ సుహేల్ దేవ్ పాసి పేరుమీద ఒక గొప్ప సాంస్కృతిక స్మారక కేంద్రం అభివృద్ధి చేసేందుకు, 50 కోట్ల రూపాయలతో సుహేల్ దేవ్ పాసి మహారాజ పరిపాలన చేసిన బాలార్ బహరూచ్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు.

మన ముందు తరాలకు మన నిజమైన హైంవ వీరులు, యోధులు, మహారాజుల గొప్ప చరిత్ర మెగామైండ్స్ మీకందరికీ తెలియపరచే ప్రయత్నం చేస్తుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

No comments