Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

యోగాతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం - Importance of yoga and benefits

యోగాతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం - Importance of yoga and benefits మనిషికి ఎన్ని స్థిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వ...

యోగాతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం - Importance of yoga and benefits

మనిషికి ఎన్ని స్థిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే, అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు రోగ నిరోదక శక్తి కూడా పెరుగుతుంది. శారీరక వికాసమే కాదు, మానసిక సంతులత కూడా సమకూరుతుంది. 

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన అపురూప కానుక 'యోగా'. ప్రతి ఏటా జూన్ 21ని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' గా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ గుర్తింపు లాంఛనం మాత్రమే. యోగా ఏనాడో మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తమైంది. యోగకు అధికారికంగా ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం.

ఇంతకీ యోగాలో ఏముంది? ఎందుకు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది ఒక మత ప్రచారంలో భాగం కాదా? ఇలాంటి ప్రశ్నలు రావడంతో తప్పులేదు. వాటన్నింటికీ సమాధానం ఉంది. మనం ముందుగా యోగా వల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం. మొదటి ఉపయోగం సంపూర్ణ ఆరోగ్యం, రెండోది మానసిక ప్రశాంతం.

మన సనాతన ధర్మం (హిందూ మతం) ఒక రూపాన్ని సంతరిచుకోకముందే యోగా పుట్టింది. ఒక మతానికి చెందిన అత్యధికులు ఆచరిస్తున్నారనే సాకుతో యోగకు మతం రంగు పులమడం మూర్ఖత్వమే అవుతుంది. యోగాలో ప్రధానంగా కనిపించేవి ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ముద్రలు, క్రియలు, ఆసనాలు. ఇందులో అనేక ఆసనాలు కనిపిస్తున్నా ప్రధానంగా 25 వరకూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల తల నుండి కాలి చిటికన వేలు వరకూ మన శరీరమంతా చురుగ్గా పని చేస్తుంది. శరీరం చక్కగా వంగటం వల్ల రక్త ప్రసరణ అన్ని అవయవాలుకు సక్రమంగా జరుగుతుంది. శ్వాస మెరుగవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, వెన్నుపూస చురుగ్గా పని చేస్తాయి. చక్కగా యోగాసనాలు చేసే వారికి శారీరక కష్టాలు తగ్గుతాయి. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు. ఇప్పటికే ఉంటే పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. తద్వార మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బద్దకాన్ని విడిచిపెట్టి చురుగ్గా పని చేసుకోగలుగుతాం. మెదడు చురుగ్గా పని చేయడం వల్ల మనలో కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతాయి. మొత్తం మీద సంపూర్ణ ఆరోగ్యానికి యోగా పూర్తి గ్యారంటి ఇస్తుంది.

యోగా ఖరీదైనదనే అపోహలు కొందరిలో వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ధనికులు, ప్రముఖులు యోగాసనాలను చేయడం, కొన్ని సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసి యోగా నేర్పడం చూసి తెలియని వారికి ఇలా అనిపించడం సహజం. మన ఆరోగ్యం కోసం ఎన్నో మందులు కొని వాడుతున్నాం. వీటి వల్ల మన జేబుకు చిల్లు మాత్రమే కాకుండా సహజ సిద్దంగా ఉండే శరీర రోగ నిరోధక శక్తిని క్రమంగా కోల్పోతున్న విషయాన్ని గ్రహించడం లేదు. అలాగే శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం జిమ్ములు, ఆరోబిక్స్, ఇతర పాశ్చాత్య వ్యాయామాల కోసం డబ్బును ఖర్చు చేస్తున్నాం. కానీ యోగాకు ఇవేమీ అవసరం లేదు. చక్కగా మీ ఇంట్లో, లేదా శుద్దమైన గాలి, వెలుతురు సక్రమంగా ఉన్న తగిన చోటు చూసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. ఇలా చేసినందుకు మిమ్మల్ని డబ్బు ఇమ్మని అడిగేవారెవరు?
 
అందరూ యోగాసనాలు వేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. యోగాతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

No comments