ఆర్యుల దండయాత్ర అనేది పెద్ద బూటకం - Is the Aryan invasion theory true ఆర్యుల దండయాత్ర అనేది పెద్ద బూటకం: బ్రిటిష్ వైట్ డాగ్స్ ద...
ఆర్యుల దండయాత్ర అనేది పెద్ద బూటకం: బ్రిటిష్ వైట్ డాగ్స్ ద్వారా ఎలా కల్పించబడందో సాక్షాలతో సహా పెడుతున్నాం చూడండి..
1866, April -10 నాడు లండన్ నగరంలో "రాయల్ ఏషియాటిక్ సొసైటీ" ఒక రహస్య సమావేశం జరిపి ఈ క్రింది విధంగా తీర్మానించింది.
ఈ "ఆర్య దండయాత్ర " సిద్ధాంతం భారతీయుల మదిలోకి ఎక్కించాలి. అప్పుడే వారు బ్రిటిష్ వారిని పరాయి పాలకులుగా భావించరు. ఎందుకంటే అనాదిగా వారి మీద ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు. అందువల్ల క్రిష్టియన్ పరిపాలనలో భారతీయులు చిరకాలం బానిసలుగా కొనసాగుతారు. ( Source: proof of Vedic Culture's Global Existence - by Stephen knapp. P.39 )
విలియం జోన్స్ (1746 -1794) భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కలకత్తాలో పని చేసేవారు. ఇతను సంస్కృతానికీ, యూరపియన్ భాషలకూ గల సంబంధం కనుగొన్న తొలివ్యక్తి. ఇతనూ, మాక్స్‌ముల్లర్, ఈ "ఆర్య" అనే శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ వీరి అసలు బుద్ధి వేరు.
1784 లో అప్పటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ కి ఉత్తరం రాస్తూ విలియం జోన్స్ " మన మతాన్ని " ఎలా వ్యాపింపజేయాలి? రోముకు చెందిన ఏ చర్చి కూడా హిందువులను క్రిస్టియన్లు గా మార్చజాలదు. అందుకే బైబిల్ ను సంస్కృతంలోకి అనువదించి స్థానిక భారతీయ మేధావి వర్గంలో వ్యాపింపజేయాలి " అంటూ వ్రాశాడు.
ఇక మాక్స్‌ముల్లర్ 1886 సంవత్సరంలో తన భార్యకు రాసిన ఉత్తరంలో "నేను ఈ వేదం అనువదించటంతో భారతదేశం తలరాత ' గొప్పగా ' మారబోతూ ఉంది. అది ఆ దేశంలోని అనేక కోట్లమంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఈ వేదం వారి మతానికి ఆధారమైన వేరు. అది వారికి చూపించి, 5000 ఏళ్ళనాటి వారి నమ్మకాలను పెకలించివేస్తుంది. (Source : The Life and Letters of the Rt. Hon. Fredrich Max Muller, edited by his wife,1902, volume 1.p. 328)
1946 సంవత్సరంలో అంబేద్కర్ రచించిన " Who were the Sudras " అనే పుస్తకంలో శూద్రులు- ఆర్యులు అని ఒక అధ్యాయమే రచించాడు. అందులో " పాశ్చాత్య రచయితలు స్రుష్టించిన "ఆర్యజాతి" సిద్ధాంతం ఏ రూపంలోనూ నిలువజాలదు. ఈ సిద్ధాంతాలు పరిశీలించినట్లైతే వారికి సుస్పష్టంగా ఈ సిద్ధాంతంలోని లోటుపాట్లు రెండు విధాలుగా కనిపిస్తాయి. అవి ఒకటి ఈ సిద్ధాంత కర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకున్న ఊహలనుంచి గ్రహించిన భావనలు గానూ, రెండు ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ, నిజాలను గుర్తించకుండా మొదటే నిర్ణయించుకున్న సిద్ధాంతానికి అనుగుణంగా ఋజువులు చూపిస్తున్నట్టు ఉంది.
వివేకానందుడు (1863- 1902) అమెరికాలో చేసిన ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు. " మీ యూరోపియన్ పండితులు, ఆర్యులు ఎక్కడనుంచో ఊడిపడి, అనాగరికులైన భారతీయుల భూములను ఆక్రమించి, భారతదేశంలో స్థిరపడినట్టు, స్థానికులను తరిమివేసినట్టు చెప్పడం ఊకదంపుడు మాటలు, తెలివితక్కువ మాటలు."
అరబిందో ఇలా అన్నాడు - ఆర్యుల సిద్ధాంతం గురించిన హేతువులు, ఋజువులు వేదంలో అసలు కనిపించవు. దీనికి సంబంధించిన తార్కాణాలు చాలా తక్కువ. అవికూడా ప్రాముఖ్యం లేనివి. అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి ఎక్కడా లేదు. (Source : secrets of Vedas - by Aurobindo.)
ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం 1920 లో బయటపడిన " సింధూ నాగరికత " త్రవ్వకాలతో పలుచబడింది. హరప్పా, మొహంజదారో మొదలైన స్థలాలు, లోతల్ రేవు, వీటి నగర నిర్మాణ రీతులు ఇంకా మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో దాదాపు 10 వేల సంవత్సరాలుగా నాగరికత ఉన్నత స్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపుతున్నాయి. అటువంటిది ' గుర్రాలపై దండెత్తి ' ద్రావిడులను తరిమికొట్టడం అన్నది ఏమాత్రం సమంజసంగా లేదు.
1980 లలో " సరస్వతీ నది " పరీవాహక ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు, ఈ నదీప్రవాహమార్గం సరిపోతూ ఉంది. ఇన్నిరోజులుగా ఆంగ్లేయులు ఈ ' నది ' వేదాల స్రుష్టిగా, ఊహగా చిత్రీకరించారు. ఆర్యుల దండయాత్ర కథను ప్రబలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు.
ఈ మధ్య స్టీఫెన్ ఓపెన్ హియర్ అనే ' జన్యు శాస్త్రజ్ఙుడు ' మైకో కార్డినల్ డీ.ఎన్.ఏ పై పరిశోధన చేశాడు. దీనిద్వారా మన పూర్వుల లక్షణాలను గుర్తించవచ్చు. దీని ప్రకారం భారతీయుల వంశవృక్షం చాలా పురాతనమైనది.
డేవిడ్ ఫ్రాలే ప్రకారం ( సుప్రసిద్ధ 'ఇండనాలజిస్ట్' ) భారతదేశ ప్రభావం ఇతర దేశాలపై ఉందనీ, ఇక్కడి ప్రజలే, నాగరికులై - యూరప్ తదితర ప్రాంతాలకు వలస వెళ్ళి ఉంటారనీ, ఋజువులతో సహా నిరూపించాడు.
సుప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త వాల్టైర్ ఫాంకోయిస్ (1694 - 1774) " నా నమ్మకం ఏమిటంటే అన్నీ గంగానదీ తీరం నుంచీ ప్రభవించాయి. ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, మెటా ఫిజిక్స్, నాగరికత, విజ్ఞానం అన్నీ అక్కడ నుంచీ వచ్చాయని నా నమ్మకం " అంటాడు.
ఇలా ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం బూటకం అనీ, ఆంగ్లేయులు కల్పించిన కట్టుకథ అనీ ఎన్నయినా ఆధారాలు, ఋజువులు చూపించవచ్చు. ఇంతవరకూ ' ఆర్యుల' దాడి సిద్ధాంతానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఎక్కడా లభించలేదు. కానీ నేటికీ మన పాఠ్య పుస్తకాలలో "బ్రిటిషు వారి " కథలనే పాఠ్యాంశాలుగా చెప్పడం చాలా అవమానకరంగా ఉంది!!

No comments