ఖాసిం రజ్వీ – హైదరాబాద్ చరిత్ర 1926 లో నిజాం 'మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లిమీన్' అనేసంస్థను ఏర్పాటు చేశాడు, అది 1929 ...
ఖాసిం రజ్వీ – హైదరాబాద్ చరిత్ర
1926 లో నిజాం 'మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లిమీన్' అనేసంస్థను ఏర్పాటు చేశాడు, అది 1929 లో ' మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్' గా రూపొందింది, వారే రజాకార్లు. వీరి లక్ష్యం సంస్థానానికి శాశ్వత పరిపాలకులుగా తామే ఉండాలి, ముస్లింలు తప్ప సంస్థానంలో ఇతరులు ఉండకూడదు, ఒకవేళ ఉన్నప్పటికీ వారు పాకీపనులు చేస్తూనో, రోడ్లు ఊడవడానికో, తమకు అవసరమైన సేవలు చేయడానికో మాత్రమే ఉంటూ తమ దయాదాక్షిణ్యాలపై మాత్రమే ఆధారపడి బతకాలి.
నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అసిఫ్ ఝా VII ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు ఖాసిం రజ్వీ. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో ఉన్న మిలిటెంట్ గ్రూప్ (నిజాం అనఫిషియల్ సైన్యం) ‘రజాకార్ల’ పేరుతో చెలామణీ అయ్యేది. రజాకార్లు ఎంతటి రాక్షసులు అంటే (ఈ రోజుల్లో మన ఊహ కు కూడా అందనంత అక్రమంగా నిజాం నిర్దేశించిన పన్నులు ఉండేవి) పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసం కత్తి తో కోసి గోర్లు ఊడబెరికే వారు. భర్తల ముందే భార్య లను అత్యాచారం చేసే వారు. భార్య ల ముందే భర్త లను నరికి చంపే వారు. భర్తల ఆచూకి చెప్పక పోతే పిల్ల వాళ్ళను పైకి ఎగురేసి కత్తి కి గుచ్చి చంపే వారు. ఆ రోజుల్లో రజాకార్లను చూసిన వాళ్లెవరూ బతికిన దాఖలాలు లేవు. రజాకార్ల సైన్యం గుర్రాల మీద ఊళ్ల వెంట పోతుంటే. అంతా భయంభయంగా తలుపులేసుకుని చిన్న చిన్న సందుల్లోంచి చూసేవాళ్లు. రజాకార్లు వెళ్తున్న సమయంలో ఎవరైనా రోడ్డుమీదకనిపిస్తే. వాళ్లను గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవాళ్లు.
ఈలక్ష్యసాధన కొరకు వారు చేసిన కొన్ని కిరాతకాలు:
హిందూ మహిళలు 9 రోజులు ఉత్సాహంతో నిర్వహించుకునే బతుకమ్మ పండుగలపై దాడులు జరిపారు. మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలను ఆడించడం వీరి పైశాచికత్వానికి పరాకాష్ట.
జనగామ దగ్గరి కొడకండ్ల గ్రామానికి పౌరోహిత్యం నిమిత్తం వచ్చిన ఏడుగురు పురోహితులలో ఐదుగురిని పట్టుకొని తలక్రిందులుగా చింతచెట్టుకు వేలాడదీసి వారి తలలకు నిప్పంటించి సజీవ దహనం చేశారు. అడ్డువచ్చిన గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేశారు.
బీదర్ సమీపంలోని గోర్డ అనే గ్రామస్తులు చైత్రమాసంలో సూర్యారాధన ఉత్సవం జరుపుకుంటున్న సమయంలో ఆ గ్రామంపై దాడి చేసి దొరికినవారిని దొరికినట్టుగా నరికి చంపేసి, దోచుకుని వెళ్ళిపోయారు.
వరంగల్ జిల్లా బహిరాన్ పల్లిలో ఒక్క గంట సమయంలో వందమందిని తుపాకీతో కాల్చి చంపేశారు, మరికొంతమందిని తాళ్ళతో కట్టిపడేసి మంటలలో కాల్చి చంపివేశారు. జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని మరపింపజేసే సంఘటన బహిరాన్ పల్లి.
చేర్యాలలో 25 మందిని చంపేశారు.
సంస్థానం చుట్టుపక్కల ఉన్న ఇండియన్ యూనియన్ లోని గ్రామాలపైన కూడా వీరు దాడులుచేశారు
ఇవి వారి రాక్షసత్వాన్ని తెలియజేసే కొన్ని సంఘటనలు మచ్చుకు మాత్రమే, ఇలాంటివి అనంతం.
సామూహిక మానభంగాలకు, దోపిడీలకు, హత్యలకు, హింసాకాండలకు, దేవాలయాల కూల్చివేతలకు, భూముల ఆక్రమణలకు అంతేలేదు.
చివరకు తమను హెచ్చరించిన షోయబుల్లాఖాన్ మొదలైన ముస్లింలను కూడా అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు.
ఆఖరి నిజాం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనంచేసిన తర్వాత రజాకార్ల సైన్యంలో చాలామంది పాకిస్తాన్ కి పారిపోయారు. ఇక్కడే మిగిలి పోయినవాళ్లు మాత్రం గెడ్డాలు తీసేసి మామూలు పౌరుల్లో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. దొరికిన రజాకార్లను భారత సైన్యం చంపి వేసింది. చివరి నిముషంలో ఖాసిం రజ్వీ విషయాన్ని అర్ధం చేసుకున్నాడు. ఇక్కడే ఉంటే నిట్టనిలువునా జనం చీల్చి చంపుతారన్న విషయం తెలిసిపోయింది. పాకిస్తాన్ కి పారిపోవాలి అంటే నిజాం సరండర్ కావాలి. అప్పుడే ప్రాణాలు దక్కుతాయి. అప్పటి ప్రధాని నెహ్రూ రజాకార్లు పాకిస్తాన్ కి వెళ్లిపోవడానికి అనుమతించారు. వల్లభాయ్ పటేల్ భారత సైన్యానికి చెప్పిన మాట నిజాంని అరెస్ట్ చేసి, ఖాసీం రజ్వీని చంపేయమని. కానీ.. నెహ్రూ జోక్యం చేసుకుని నిజాంని ఏమీ చేయొద్దని, ఖాసిం రజ్వీని అరెస్ట్ చేయమని పటేల్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
1957 సెప్టెంబర్ 11న జైలు నుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు. జైలునుంచి విడుదలైన తర్వాత. సరిగ్గా హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిన రోజునే రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లడం మరో విషయం. పాకిస్తాన్ కి వెళ్లేముందు నిజాం కాలం నాటి MIM అనే రాజకీయ పార్టీకి జీవం పోసి దాన్ని సమర్ధుడైన నాయకుడి చేతుల్లో పెట్టి వెళ్లాలని రజ్వీ నిర్ణయించుకున్నాడు. పార్టీ సభ్యులకు వర్తమానం పంపాడు. ఓ ముప్ఫై నలభైమంది మాత్రం సమావేశానికి హాజరయ్యారు. కానీ.. బాధ్యతల్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. పన్నెండేళ్లకు పైబడిని ఏ యువకుడికైనా పార్టీ పగ్గాలను అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని రజ్వీ ఆ సమావేశంలో ప్రకటించాడు. అబ్దుల్ వహిద్ ఒవైసీ అనే ఓ పద్దెనిమిదేళ్ల కుర్రాడు ముందుకొచ్చాడు. అప్పట్లో కనీసం అతనికి పార్టీతో కూడా సంబంధం లేదు. వహిద్ ఒవైసీ ధైర్యాన్ని చూసి అప్పటి నిజాం ఎంఐఎం పార్టీ అధినేతగా అతని పేరుని ప్రపోజ్ చేశాడు. ఖాసిం రజ్వీ మద్దతు తెలిపాడు. పార్టీ పగ్గాలు ఒవైసీ చేతుల్లోకి వచ్చాయి. బ్యాన్ చేసిన పార్టీ నాయకత్వాన్ని స్వీకరించిన నేరానికి అతనికి 11 నెలల జైలుశిక్ష విధించారు. జైలు జీవితం ముగిశాక ఒవైసీకి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చేందుకు నెహ్రూ ముందుకొచ్చారు.
కానీ.. వహిద్ ఒవైసీ అందుకు అంగీకరించలేదు. ఎంఐఎంకి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు పూర్తి సమయాన్ని వెచ్చించాడు. 1975లో వహిద్ ఒవైసీ కొడుకు సలావుద్దీన్ ఒవైసీ తండ్రి నుంచి పార్టీ పగ్గాల్ని తీసుకున్నాడు. ఆయన కొడకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రస్తుతం పార్టీ బాగోగులు చూస్తున్నారు.
1. మీర్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారత ప్రభుత్వం రాజ్ ప్రముఖ్ ని చేసింది. అంటే గవర్నర్ హోదా అన్నమాట.
2. రజాకార్లకు నాయకత్వం వహించి అన్యాయంగా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లి, అక్కడ ఎవరూ పట్టించుకోక కరాచీలో దీనాతిదీనమైన పరిస్థితిలో చనిపోయాడు.
3. మీర్ లాయక్ అలీ ఖాన్ – నిజాం ప్రభుత్వ దివాన్ – అందరికన్నా ముందు పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు.
4. హైదరాబాద్ సంస్థానానికి మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ అల్ ఇద్రూస్ చరిత్ర కారా. హైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించిన నవాబులలో అత్యంత క్రూరుడు ఏడవ మరియు చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1911 నుండి 1948 వరకు సాగిన ఈయన పరిపాలనలో 90 శాతం ఉన్న హిందూసమాజంపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, అవమానాలు మొదలైన రక్తసిక్త చరిత్రను అక్షరబద్దం చేస్తే లక్షపుటల గ్రంధం తయారవుతుంది అనడం అతిశయోక్తి కాదు.
అంటూ నల్లగొండ యాదగిరి నైజాము దుర్మార్గాలను వర్ణిస్తూ వ్రాసిన పాటను పల్లెపల్లెలో ప్రజలంతా పాడుకున్నారు. (సెప్టెంబరు 17 నాడు హైదరాబాదు సంస్థాన విమోచన దినోత్సవం).
హైదరాబాద్ సంస్థానం పతనం తరువాత ప్రముఖులు - నెహ్రూ దయ వల్ల నిజాం పరిస్థితి కొంత బెటర్.
1. మీర్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారత ప్రభుత్వం రాజ్ ప్రముఖ్ ని చేసింది. అంటే గవర్నర్ హోదా అన్నమాట.
2. రజాకార్లకు నాయకత్వం వహించి అన్యాయంగా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లి, అక్కడ ఎవరూ పట్టించుకోక కరాచీలో దీనాతిదీనమైన పరిస్థితిలో చనిపోయాడు.
3. మీర్ లాయక్ అలీ ఖాన్ – నిజాం ప్రభుత్వ దివాన్ – అందరికన్నా ముందు పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు.
4. హైదరాబాద్ సంస్థానానికి మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ అల్ ఇద్రూస్ చరిత్ర కారా. హైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించిన నవాబులలో అత్యంత క్రూరుడు ఏడవ మరియు చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1911 నుండి 1948 వరకు సాగిన ఈయన పరిపాలనలో 90 శాతం ఉన్న హిందూసమాజంపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, అవమానాలు మొదలైన రక్తసిక్త చరిత్రను అక్షరబద్దం చేస్తే లక్షపుటల గ్రంధం తయారవుతుంది అనడం అతిశయోక్తి కాదు.
మా పల్లెలు దోస్తివి కొడకో నైజాము సర్కరోడ
నాజీల మించినవురో నైజాము సర్కరోడ
పండీన పంటనంతా నువు తీసుకెల్తివి కొడకో నైజాము సర్కరోడ
యమ బాధ పెడ్తివి కొడకో నైజాము సర్కరోడ
గోలకొండ ఖిల్లా క్రింద నీ గోరీ కడ్తము కొడకో నైజాము సర్కరోడ
అంటూ నల్లగొండ యాదగిరి నైజాము దుర్మార్గాలను వర్ణిస్తూ వ్రాసిన పాటను పల్లెపల్లెలో ప్రజలంతా పాడుకున్నారు. (సెప్టెంబరు 17 నాడు హైదరాబాదు సంస్థాన విమోచన దినోత్సవం).
No comments